Kurnool: కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రీ నదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. గోనెగండ్ల మండలం గంజహల్లి, దేవనకొండ మండలం తెర్నెకల్ మధ్య ఉన్న హంద్రీ నదిలో 25 మంది చిక్కుకున్నారు. చిక్కుకున్న వారు గంజిహల్లికి చెందిన వారిగా తెలిసింది. ఉదయం వాగులో నీటి ప్రవాహం తక్కువగా ఉండగా గంజిహల్లి నుంచి కూలీలు పొలాలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వరద ప్రవాహం పెరగడంతో కూలీలు అందులో చిక్కుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. స్థానికుల సహాయంతో కూలీలు, రైతులు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Also: Andhra Pradesh: భారీ విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు.. రాష్ట్రంలో మరో 15 వేల ఉద్యోగాలు
