NTV Telugu Site icon

Hyderabad: మైనర్ బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల యువకుడిని అరెస్టు..

Rape Attempt

Rape Attempt

A man raped 12 years minor girl in Meerpet : ప్రతిరోజు మనచుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్న కానీ చాలా మంది వాటిని పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనేకచోట్ల మహిళలపై దాడులు జరుగుతున్న., అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న కానీ చాలామంది ఇంట్లో వారి పిల్లలు, మహిళల భద్రతపై అలసత్వం వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా 12 ఏళ్ల పొరుగింటి బాలికపై 24 ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాలపడడంతో ఆ అమ్మాయి గర్భం దాల్చిందని ఆరోపణలు వచ్చాయి.

Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు..

బీహార్ నుంచి వలస వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు ఆమె పరిస్థితిని గుర్తించడంతో ఈ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు చికిత్స అందించిన తర్వాత వైద్య మూల్యాంకనం, కౌన్సెలింగ్ కోసం బాలికను భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె గర్భం దాల్చినట్లు నివేదికలో వెల్లడైంది.

Kavach System : గోండా రైలు ప్రమాదం.. కవాచ్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

Show comments