Spain Fire: స్పెయిన్‌లో ఘోరం.. మంటల్లో కాలి 24 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పెయిన్‌లో (Spain) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వాలెన్సియాలో (Valencia) అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది మరణించినట్లు తెలుస్తోంది.
14 అంతస్తుల ఎత్తైన అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునే క్రమంలో ప్రజలు కిందకి దూకేసినట్లు తెలుస్తోంది. అలా పలువురు బాల్కనీల నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఇంకొందరు మంటల్లోనే సజీవదహనం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
ప్రస్తుతానికి నలుగురు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 14 మంది ఆచూకీ మాత్రం తెలియకుండా పోయిందని చెబుతున్నారు. మరో 13 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని పలువురిని కాపాడినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేశారు.
తొలుత ఓ భవనంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో దానికి వ్యాపించినట్లు సమాచారం. అగ్నికీలలు, పెద్దఎత్తున పొగ వెలువడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రమాదానికి గల కారణాలు ఇంక తెలియరాలేదు. మృతుల కుటుంబాలకు స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచేజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.
24 people are feared dead after an apartment complex caught fire in Valencia, Spain.
Some residents were forced to jump off their balconies to escape the inferno that engulfed the 14 floor high apartments.
— Oli London (@OliLondonTV) February 23, 2024
తాజావార్తలు
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!