Site icon NTV Telugu

LandSlides: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి.. మరో 52 మంది..

Venezula

Venezula

Landslides: వెనెజులాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో నది పొంగిపొర్లడంతో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 52 మంది గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన సెంట్రల్ వెనిజులాలో జరిగింది. దేశంలోని భారీ వర్షాల కారణంగా సంభవించిన తాజా ఘోరమైన విపత్తు గురించి అధికారులు ఆదివారం తెలిపారు. ఇళ్లు, వ్యాపారాలు ధ్వంసం అయ్యాయి. గత 30 ఏళ్లలో ఈ సారి అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Boat Capsized: ఘోర పడవ ప్రమాదం.. 76 మంది మృతి

ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశామని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వైస్​ ప్రెసిడెంట్​ డెల్సీ రోడ్రిగ్జ్​ తెలిపారు. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ ఘోర ప్రమాదంలో నిర్వాసితులైన వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అధిక వర్షపాతం కారణంగా సంక్షోభంలో ఉన్న దక్షిణ అమెరికా దేశంలో ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.

Exit mobile version