Fire Accident : బర్త్ డే వేడుకలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 17మంది సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: పాలస్తీనా.. గాజా నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో శరణార్థుల శిబిరంలో పెను విషాదం నెలకొంది. గాజా స్ట్రిప్ లోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 21మంది సజీవ దహనమయ్యారు. ఆ ఇంట్లో అప్పటి వరకు ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక కాస్త చివరికి విషాదంగా ముగిసింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబమే తుడిచిపెట్టుకు పోయింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోగా వారిలో 17మంది ఒకే కుటుంబీకులు కావడం హృదయాలను పిండేస్తోంది. సజీవ దహనం అయిన వారిలో 7గురు చిన్నారులు ఉన్నారు. గాజాలోని అత్యధిక జనసాంద్రత ఉండే జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలోని నాలుగంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. జబాలియా శరణార్థుల శిబిరంలో తొలుత మొదటి అంతస్తులో ప్రమాదం అంటుకుంది. అనంతరం మూడు అంతస్తులకు వ్యాప్తి చెందాయని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో నిల్వచేసిన పెట్రోలుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నా.. దానికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు.
Read Also: Rajashekar: వెబ్ సిరీస్ లపై మనసుపడ్డ యాంగ్రీ యంగ్ మెన్
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఆ ఇంట్లో ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకతోపాటు, ఈజిప్టు నుంచి ఓ వ్యక్తి రావడంతో ఆనందంతో అందరూ కలిసి వేడుక జరుపుకున్నారు. ఈ క్రమంలో సంభవించిన అగ్ని ప్రమాదం వారిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ప్రమాదం గురించి చెప్పేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా మిగలకపోవడం విషాదం. కాకపోతే.. ప్రమాదానికి పెట్రోలే కారణమన్న వార్తలను అబూ రయా బంధువు మహ్మద్ అబూరయా కొట్టిపడేశారు. వారి ఇంట్లో ఫర్నిచర్ అధికంగా ఉందని, మంటలు పెద్ద ఎత్తున చెలరేగడానికి అది కూడా కారణమై ఉంటుందని అన్నారు. బాధిత కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. గాజా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ను నిల్వచేసుకోవడం ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది. ఇప్పుడదే వారి ప్రాణాలు తీస్తోంది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఈ అగ్ని ప్రమాదాన్ని జాతీయ విషాదంగా అభివర్ణించారు. కాగా, బిల్డింగ్‌లో ఓ ఇంట్లో ఇంధనం నిల్వ చేయడంతో అగ్నిప్రమాదం జరిగిందని సివిల్ డిఫెన్స్ యూనిట్ ప్రతినిధి చెప్పారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల క్యాంపుల్లో జబాలియా ఒక్కటి. ఇక్కడ 20 లక్షల 30 వేల మంది నివాసముంటున్నారు.
#Gaza 💔😢🇵🇸 #Palestine
Pray for Gaza !
Twenty one Palestinians, including seven children, have died after a huge fire broke out at a residential building in Jabalia city, north of Gaza in Palestine and the fire still until now#غزة #حريق #جباليا #حريق_غزة #فلسطين#FreePalestine pic.twitter.com/iexft82ZXU— Islam Essa🇵🇸#Gaza🙋♀️👑 (@IslamEssa_Gaza) November 17, 2022
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!