మార్కెట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఉండే క్రేజే వేరు. బైక్ లవర్స్ కు మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ అత్యంత సరసమైన రోడ్‌స్టర్ బైక్ 2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 విడుదలైంది. 2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 లో అతిపెద్ద మార్పు బ్యాక్ సస్పెన్షన్. ఇది ఇప్పుడు లీనియర్ స్ప్రింగ్ నుంచి ప్రోగ్రెసివ్ స్ప్రింగ్‌గా మారింది. ఎగ్జాస్ట్ కోసం కొత్త రూటింగ్‌తో పాటు, గ్రౌండ్ క్లియరెన్స్ 10 మిమీ పెరిగింది. కంపెనీ తన అన్ని వేరియంట్లకు స్లిప్-అసిస్ట్ క్లచ్ ఫీచర్‌ను అందించింది.
Also Read:AP DGP Serious Warning: పహల్గామ్ ఉగ్రదాడి.. వారికి ఏపీ డీజీపీ సీరియస్ వార్నింగ్
2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇప్పుడు LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ పాడ్‌తో కూడిన డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టాప్ వేరియంట్‌లో టైప్-సి ఛార్జర్‌తో వస్తుంది. ఇది ఇప్పుడు 6 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. మునుపటిలాగే, ఇది 349cc ఎయిర్-కూల్డ్ J-సిరీస్ మోటార్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 20.2hp ఎనర్జీని, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో అనుసందానించబడి అదే స్లిక్-షిఫ్టింగ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేయబడింది.
Also Read:Shruthi Hasan : లోకల్ ట్రైన్లలో కాలేజీకి వెళ్లా.. శృతి హాసన్ ఎమోషనల్..
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బేస్ వేరియంట్ ధర రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). మిడ్-స్పెక్ వేరియంట్ ధర రూ.1.77 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్ వేరియంట్ ధర రూ.1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). పాత మోడల్‌తో పోలిస్తే దాని టాప్ వేరియంట్ ధరను రూ.5,000 పెంచారు.