NTV Telugu Site icon

Karnataka: 2019 సీన్​ రిపీట్​ కోసం మైసూర్​ యువరాజుకు బీజేపీ టికెట్..!

Wadiyar

Wadiyar

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడుదల చేసిన బీజేపీ లోక్​ సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్​-కొడగు స్థానం నుంచి మైసూర్​ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ ​ను బరిలో బీజేపీ దింపింది.

Also read: Stock Market Crash : స్టాక్ మార్కెట్లో సునామీ.. ఒక్క రోజులో కొట్టుకుపోయిన రూ.14లక్షల కోట్లు

ఇక్కడ మై ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను పక్కన పెట్టి మరీ యదువీర్ ​ను రంగంలోకి లోక్ ​సభ పోరులో నిలిపింది. మైసూర్​-కొడగు ప్రాంతంలో మైసూర్​ రాజవంశానికి ఉన్న ప్రాబల్యాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు బీజేపీ లోక్ ​సభ ఎన్నికల్లో ఆయనకి సీటు ఇచ్చిందని యిట్టె అర్థమవుతుంది. నిజానికి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి కాస్త బలం తక్కువే. దక్షిణాది రాష్ట్రాలలోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. గతేడాది వరకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ బాగానే సీట్లు రాబట్టాలని ప్లాన్ చేస్తుంది.

also read: WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్​ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!

ఇకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా., 2019 వచ్చిన లోక్ ​సభ ఎన్నికల ఫలితాలని మరోసటీ రిపీట్​ చేయాలని అనుకోవడంతో మరింత అక్కడ బీజేపీ కష్టపడాల్సి ఉంటుంది. ఇదే క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం జేడీఎస్ ​తో పొత్తు కుదర్చుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మైసూర్ రాజ వంశీకుల ప్రభావం ఆ సమీప ప్రాంతాల్లోని లోక్​ సభ సీట్లపైన ప్రభావితం ఉంటుందని, కాబట్టే అక్కడ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాను కాదని మరీ మైసూర్​ యువరాజు యదువీర్ ​ను లోక్ సభ పోరులో బీజేపీ దింపిదని తెలుస్తోంది.