200 Year Old Message: గాజు సీసాలో 200 ఏళ్ల నాటి సందేశం!
- 200 ఏళ్ల క్రితం నాటి సందేశం
- గౌలిష్ గ్రామానికి సంబంధించిన వివరాలు
- 1825లో గౌలిష్ ప్రాంతంలో తవ్వకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
200 Year Old Letter: పురావస్తు శాఖ తవ్వకాల్లో దాదాపు 200 ఏళ్ల క్రితం నాటి ఓ సందేశం తాజాగా బయటపడింది. ఓ పురావస్తు శాస్త్రవేత్త గాజు సీసాలో పెట్టిన సందేశం ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఒక వలంటీర్ల బృందానికి దొరికింది. ఈ వారంలో అత్యవసర తవ్వకాలు చేపడుతుండగా.. సందేశం లభ్యమైందని వారు వెల్లడించారు. గాజు సీసాలో చుట్టి ఉంచిన ఒక లేఖ ఉంది. నార్మాండీ పట్టణానికి సమీపంలో కొండపై ఉండే గౌలిష్ అనే గ్రామానికి సంబంధించిన వివరాలు ఆ లేఖలో ఉన్నాయి.
పలు మేధో సంఘాల్లో సభ్యుడిగా ఉన్న ‘పీజే ఫెరెట్’ అనే స్థానిక పురావస్తు శాస్త్రవేత్త జనవరి 1825లో గౌలిష్ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినట్టు లేఖలో ఉంది. ఈ ప్రాంతంలో ఆయన పలు పరిశోధనలు చేసినట్లు ఉంది. పురావస్తు శాస్త్రవేత్త ఫెరెట్ స్థానికంగా ప్రముఖు వ్యక్తి అని ఓ అంతర్జాతీయ మీడియా తమ కథనం పేర్కొంది. 200 ఏళ్ల క్రితం ఫెరెట్ మొదటిసారి తవ్వకాలు నిర్వహించినట్టు ఫ్రెంచ్ పట్టణం మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి.
Also Read
- Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
- NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
- PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
- Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Also Read: Senegal Migrants: సెనెగల్ తీరంలో తీవ్ర విషాదం.. పడవలో 30 మృతదేహాలు!
తవ్వకాలు చేపట్టిన వలంటీర్ల బృందానికి సారధ్యం వహించిన గిల్లామ్ బ్లొండెల్ మాట్లాడుతూ… ‘మహిళలు వాసన వెదజల్లె లవణాలు కలిగిన ఉన్న చిన్నచిన్న సీసాలను మెడ చుట్టూ ధరించేవారు. గతంలో ఇక్కడ త్రవ్వకాలు జరిగాయని మాకు తెలుసు. కానీ 200 సంవత్సరాల క్రితం నాటీ ఈ సందేశాన్ని కనుగొనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా వడ్రండి పనిచేసేవాళ్లు ఇలాంటి టైమ్ క్యాప్సూల్స్ వదిలిపెడుతుంటారు. కానీ పురావస్తు శాస్త్రంలో ఇలా జరగడం చాలా అరుదు. చాలా మంది పురావస్తు శాస్త్రజ్ఞులు వారి పని పూర్తయ్యాక ఇంకా ఎవరూ రారులే అని భావిస్తుంటారు. ఇది గౌలిష్ గ్రామం అనే విషయం మాకు తెలుసు. ఈ ఊరిలో ఏం జరిగిందనేది తెలియదు. అది ప్రాముఖ్యమైన ప్రదేశమా? అన్నది కనుక్కోవాలి’ అని అన్నారు.
తాజావార్తలు
-
KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
-
Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!
-
Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!