Site icon NTV Telugu

Crime News: యువకుడి దారుణం.. తండ్రిని నరికి చంపి, సవతి తల్లిపై అత్యాచారం

Crime News

Crime News

Crime News: ఒడిశాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని నరికి చంపి, ఆపై సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన టోమ్కా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. సవతి తల్లి తన తండ్రి వద్ద ఉండనివ్వకపోవడంతో ఆ వ్యక్తి వేరే గ్రామంలో నివసించాడు. ఆదివారం రాత్రి తన తండ్రి ఇంటికి వెళ్లిన అతడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు.

Read Also: Police Torture: దారుణం.. పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

రెచ్చిపోయిన ఆ యువకుడు సవతి తల్లిలో ఓ విషయంలో వాగ్వాదానికి దిగగా.. తండ్రి జోక్యం చేసుకుని భార్యకు మద్దతుగా మాట్లాడాడు. కొద్దిసేపటికే పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఆ యువకుడు తన తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. ఆ వ్యక్తి తన 65 ఏళ్ల తండ్రిని పదునైన ఆయుధంతో హతమార్చాడు. ఆ తర్వాత అతను తన సవతి తల్లిపై అత్యాచారం చేసి, ఇంటి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు టోమ్కా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే పాత్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య, అత్యాచారానికి దారితీసిన ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సవతి తల్లి అతడిని తన తండ్రితో ఉండడానికి అనుమతించలేదని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.

Exit mobile version