తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. అయితే, రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇద్దరు బాలురు కిడ్నాప్ అయ్యారు. తాజాగా తిరుపతి బస్టాండ్‌లో మరో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని ఫ్లాట్ ఫారం 3 దగ్గర రెండేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకుపోయాడు. శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం కోసం తిరుపతిలోని చెన్నై ఫ్లాట్ ఫామ్ దగ్గర రాత్రి ఈ ఘటన జరిగింది.
Read Also: Naga Vamshi: మేము రావట్లేదు అనుకుంటున్నారేమో… వస్తున్నాం రికార్డులు కొడుతున్నాం
అయితే, అర్థరాత్రి 2 గంటలకు బాలుడు కిడ్నాప్ కు గురైనట్లు గుర్తించిన తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. కిడ్నాప్ అయిన బాలుడిని చెన్నై, వరసవక్కంకు చెందిన చంద్రశేఖర్-మీనా దంపతుల కుమారుడు అరుల్ మురుగన్‌గా (2) గుర్తించారు. బాలుడితో పాటు కిడ్నాపర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, కిడ్నాపర్ వయస్సు 32 సంవత్సరాలు ఉండవచ్చు అని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ వైట్ షూ…గ్రీన్ కలర్ షర్ట్ తో వేసుకుని ఉన్నాడు.. అర్ధరాత్రి 2.20 నిమిషాలు సమయం బాలుడు కిడ్నాప్ అయ్యాడు అని చెప్పారు. కిడ్నాపర్ కోసం ప్రత్యేక టీంలతో దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి ఈస్ట్ పీఎస్ పోలీసులు వెల్లడించారు.