Site icon NTV Telugu

US Army Helicopters: కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు

Helicopters

Helicopters

US Army Helicopters: అమెరికాలోని అలస్కాలో యూఎస్ మిలిటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. మిలటరీ శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శిక్షణ విమానాలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లలో ఇద్దరు చొప్పున ఉన్నారు. ఈ ఏడాది అలస్కా రాష్ట్రంలో రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదానికి గురవడం రెండోసారి.

Read Also: Anand Mohan: గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ విడుదల.. వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్

ఆర్మీ హెలికాప్టర్ల ప్రమాదం గురించి ఎలాంటి సమాచారం అందలేదని అమెరికా ఆర్మీ అలస్కా ప్రతినిధి జాన్ పెన్నెల్ చెప్పారు. హెలికాప్టర్ల ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామని, సమాచారం అందిన తర్వాత మరిన్ని వివరాలు అందజేస్తామని ఆర్మీ అధికారులు చెప్పారు. యుఎస్ ఆర్మీ అలాస్కా నుంచి ఒక ప్రకటన ప్రకారం.. హీలీకి సమీపంలో ఈ రెండు హెలికాప్టర్లు కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లు ఫెయిర్‌బ్యాంక్స్ సమీపంలో ఉన్న ఫోర్ట్ వైన్‌రైట్ నుంచి వచ్చాయి. ఫిబ్రవరి నెలలో టాకీత్నా నుంచి టేకాఫ్ అయిన తర్వాత అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

Exit mobile version