NTV Telugu Site icon

BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. @టార్గెట్ 2024

Bjp

Bjp

BJP : దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహిస్తూ సమావేశాలకు చేరుకున్నారు. ఈ సమావేశాలు రెండ్రోజుల పాటు జరుగనున్నాయి. ప్రధాని మోడీతో పాటు 35మంది కేంద్ర మంత్రులు, 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పార్టీ అధ్యక్షులు, ఆర్.ఎస్.ఎస్, బిజేపి కి సంధానకర్తలుగా వ్యవహరించే మరో 27 మంది నేతలు పాల్గొననున్నారు.

Read Also: Delhi MLA’s : ఆక్సిజన్ సిలిండర్లతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు

అంతేగాకుండా, సమావేశాల్లో 19 మంది మాజీ ముఖ్యమంత్రులు, 12 మంది మాజీ ఉప ముఖ్యమంత్రులు, 17మంది ఫ్లోర్ లీడర్లు కూడా ఉన్నారు. సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన జేపీ నడ్డా 2023 సంవత్సరం తమకు ఎంతో కీలకమన్నారు. ఈ ఏడాది జరగబోయే 9 రాష్ట్రాల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని బీజేపీ కార్యవర్గానికి పిలుపునిచ్చారు. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీజేపీ ఇప్పటివరకూ 1,30,000 పోలింగ్ బూత్‌లకు చేరుకుందని, బలహీనంగా ఉన్న 72 వేల పోలింగ్ బూత్‌లను బలోపేతం చేసుకోవాలని నడ్డా చెప్పారు.

Read Also:Crime news : చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అరుదైన వన్యప్రాణుల పట్టివేత

అంతే కాకుండా ప్రతి పక్ష హోదాలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టిన కార్యక్రమాల పై చర్చ జరగనుంది. దేశంలో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిస్థితులు, సామాజిక సమస్యలు పై చర్చ ఉంటుంది అనంతరం పలు తీర్మానాల ఆమోదం ఉంటుందని సమాచారం. 2023లో జరిగే 9 రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఈ సమావేశాల్లో మెగా ప్లాన్ సిద్ధం చేస్తారు. దేశం నలుమూలల నుంచీ ప్రతినిధులు రావడంతో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ పార్టీ ప్రస్తుత పరిస్థితిపై లోతుగా చర్చిస్తారు.

Read Also:Harassment : అత్తింట్లో దించుతానని అడవిలోకి తీసుకెళ్లి.. బాలికపై ముగ్గురు అఘాయిత్యం

బలహీనతలు అధిగమిస్తూ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరోమారు సొంతంగా అధికారంలో వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేకపోయిన లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపు సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. మెగా ప్లాన్ రూపొందిస్తారు. కేంద్రంలో బీజేపీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు.

Show comments