HYD: పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్‌ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది. గాజు ముక్కల పొడి, వివిధ రసాయనాల మిశ్రమంతో తయారైన ఈ మాంజా పతంగులు ఎగురవేసే పిల్లలకు తీవ్ర గాయాలు కలిగిస్తోంది.
Viral Video : తలైవా పాటకు.. చెస్ ఛాంపియన్స్ స్టెప్పులు..
పోలీసులు నిషేధిత మాంజా అమ్మకాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నా, ఇది గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లోకి వచ్చేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ నిషేధిత మాంజా విక్రయాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. గుల్జార్‌హౌజ్, కేశవగిరి, సంతోష్‌నగర్, ధూల్‌పేట్, నాంపల్లి, పురానాపూల్ ప్రాంతాల్లోని 500కుపైగా పతంగుల దుకాణాలు హోల్‌సేల్ వ్యాపారం చేస్తుంటాయి. పాతబస్తీకి తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి రిటైల్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తారు. దుకాణాలతో పాటు గోదాముల్లో నిల్వ చేసిన మాంజా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతంలో రూ.50 కోట్లు దాటే వ్యాపారం జరుగుతుంది.
నిషేధిత మాంజా వల్ల పక్షులు తీవ్రమైన గాయాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ది యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ (AWCS) పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత ఏడాది సంక్రాంతి పండగ సమయంలో 3 రోజుల్లో 45 పక్షులను, ఏడాదిలో మొత్తం 1256 పక్షులను రక్షించిన AWCS ఈ సంవత్సరం జనవరి 10 నాటికి 22 పక్షులను రక్షించింది. పర్యావరణానికి హానికరమైన నిషేధిత మాంజాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని, పక్షుల రక్షణకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
Team India: 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..!