NTV Telugu Site icon

Stray Dogs: దేశ రాజధానిలో విషాదం.. వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం

Dogs

Dogs

Stray Dogs: గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు కరిచి చంపేశాయి. రెండు రోజుల క్రితమే బాలుడి అన్నను కూడా కుక్కలు కరిచి చంపడం మరింత విషాదం. వసంత్‌కుంజ్‌కు సమీపంలోని సింధి క్యాంప్‌ ఏరియాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా నిరుపేద జనం ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.

ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌ సమీపంలోని అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆనంద్‌ అనే ఏడేళ్ల బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం నివసించే ఇంటి సమీపంలో ఉన్న అడవిలో అతని కోసం వెతకడం ప్రారంభించారు.రెండు గంటల అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అంతేగాక చిన్నారి శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆనంద్‌పై అడవిలోని వీధి కుక్కలు, మేకలు, పందులు దాడి చేసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపారు.

Read Also: Militants Surrender: అరుణాచల్‌లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు

అయితే అన్నదమ్ములిద్దరూ మూడు రోజుల వ్యవధిలో వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం ఆ ఇంట్లో విషాదం నింపింది. గత శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆనంద్‌ను వీధి కుక్కలు కరిచిచంపాయి. ఈ ఘటనను మరువకముందే ఇవాళ మూత్ర విసర్జన చేసేందుకు ఇంటిముందుకు వచ్చిన ఆదిత్యపై వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీశాయి. మూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇద్దరూ కుక్కల దాడిలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.