NTV Telugu Site icon

Corruption: చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు.. రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం

Corruption

Corruption

Corruption: అవినీతి నిరోధక శాఖకు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయగా.. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఒకరి నివాసంలో రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్‌లో అరెస్టయిన ఇద్దరిలో అస్సాం సివిల్ సర్వీస్ (ఏసీఎస్) అధికారి కూడా ఉన్నారని తెలిపింది. ధుబ్రి జిల్లా పరిషత్‌ సీఈవో బిశ్వజిత్‌ గోస్వామి పూర్తి చేసిన పనుల బిల్లు మొత్తంలో 9 శాతాన్ని కాంట్రాక్టర్‌ నుంచి లంచంగా డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌, అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు అందింది.

Also Read: Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి

ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారిని పట్టుకునేందుకు వల పన్నారు. సీఈవో కార్యాలయంలో ధుబ్రి అదనపు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ మృణాల్ కాంతి సర్కార్ రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఏసీఎస్ అధికారి బిశ్వజిత్ గోస్వామిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బిశ్వజిత్ గోస్వామి ఆస్తులపై సోదాలు నిర్వహించగా.. రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఆస్తి కొనుగోలు, బహుళ బ్యాంకు ఖాతాలు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన అనేక పత్రాలు కూడా దొరికాయి.

ఆ ఇద్దరిని పట్టుకున్న అధికారులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభినందించారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అవినీతి నిరోధక డ్రైవ్‌లో విజయవంతమైందని, ఫలితంగా మే 10, 2021 నుంచి 117 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశామని సీఎం తెలిపారు. అదే దృఢ సంకల్పంతో, శక్తితో పరిపాలనలో అవినీతి నిర్మూలనకు కృషి కొనసాగుతుందని ఆయన అన్నారు.