Pushpa 2 : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ప్రస్తుతం థియేటర్లను పుష్ప రాజ్ రూల్ చేస్తున్నాడు. బాక్సాఫీసు వద్ద సంచలన కలెక్షన్లతో దుమ్ము లేపుతున్నాడు. ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే వారి కుటుంబాలకు విషాదం నింపుతున్నారు. గురువారం ఉదయం దొడ్డబల్‌పూర్ సమీపంలోని బాశెట్టిహళ్లి వద్ద వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రవీణ్ తమచలం (19) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవీణ్ పుష్ప-2 స్క్రీనింగ్ థియేటర్‌కి చేరుకునే హడావిడిలో రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలోనే రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
Read Also:Elon Musk: ఎలాన్ మస్క్‌తో ఇజ్రాయెల్ అధ్యక్షుడి చర్చలు.. ఎందుకంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రవీణ్ తమచలం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన ప్రవీణ్ ఐటీఐ డిప్లొమా హోల్డర్‌గా ఉంటూ బాశెట్టిహళ్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవాడు. ఉదయం 10 గంటలకు పుష్ప-2 షో చూసేందుకు గాంధీనగర్‌లోని వైభవ్ థియేటర్‌కి ప్రవీణ్, అతని స్నేహితులు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన ప్రవీణ్ ఇద్దరు స్నేహితుల కోసం పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు. ఈ సంఘటన, విషాదానికి దారితీసిన పరిస్థితుల గురించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Also:Eknath Shinde: హోం మంత్రి పదవి కావాలని ఏక్‌నాథ్ షిండే డిమాండ్..