Kanaka Durga Temple: విజయవాడ: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానములో ఉగాది ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉగాది ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక, 19 రోజుల తర్వాత ఈ రోజు కనకదుర్గమ్మ హుండీ లెక్కించారు.. రూ.2,76,11,524 నగదు, బంగారం: 478 గ్రాములు, 4 కేజీల 830 గ్రాముల వెండి సమర్పించుకున్నారు. పలు దేశాల నుంచి దర్శనానికి వచ్చిన భక్తులు ఆయా దేశాలకు చెందిన కరెన్సీ సైతం హుండీలో వేశారు. USA – 1451 డాలర్లు, ఓమన్ – 1 రియాల్స్, UK – 20 పౌండ్లు, ఇంగ్లాండ్ – 110 పౌండ్లు, ఆస్ట్రేలియా – 10 డాలర్లు, కెనెడా – 85 డాలర్లు, Euro – 5 యూరోలు, సింగపూర్ – 2 డాలర్లు, UAE – 110 దిర్హమ్స్, కువైట్ – 0.25 దినార్, Quatar – 7 రియాల్స్, సౌదీ – 8 రియాల్స్, మలేషియా – 1 రింగేట్ సమర్పించారు. ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా ఈ – హుండీకి రూ.70, 541 వచ్చినట్లు అధికారులు తెలిపారు. లెక్కింపునకు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ కె.ఎస్ రామరావు, సహాయ కార్యనిర్వాహణాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, ఎస్‌పీఎఫ్ మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, భవాణీ సేవాదారులు హాజరయ్యారు.
Read Also: Top Headlines @ 5 PM : టాప్ న్యూస్