Site icon NTV Telugu

Bus Fire: బస్సులో చెలరేగిన మంటలు.. అగ్నికి ఆహుతైన 17 మంది ప్రయాణికులు

Bus Fire

Bus Fire

Bus Fire: దక్షిణ పాకిస్తాన్‌లో ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దేశ వాణిజ్య రాజధాని కరాచీకి 98 కిలోమీటర్ల (61 మైళ్లు) దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం నూరియాబాద్‌లో ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతులంతా సెప్టెంబర్‌లో వరదల కారణంగా ప్రభావితులైన వరద బాధితులని తెలుస్తోంది. సెప్టెంబరులో భారీ వరదల కారణంగా వారు కరాచీలోని షెల్టర్ క్యాంపు నుండి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఇంతలో ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు.

Supreme Court: లక్ష్మణరేఖ ఎక్కడుందో మాకూ తెలుసు.. నోట్ల రద్దును పరిశీలించాల్సిందే..

షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పార్లమెంటరీ ఆరోగ్య కార్యదర్శి సిరాజ్ ఖాసిమ్ సూమ్రో తెలిపారు. కరాచీ, హైదరాబాద్, సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో నగరాలను కలిపే ఎం-9 మోటార్‌ వే వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Exit mobile version