Fire Accident: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. 16 కార్లు, 5 దుకాణాలు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 కార్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 1.17 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. పార్కింగ్ స్థలంలో అద్దె ప్రాతిపదికన తమ వాహనాలను పార్క్ చేసే స్థానికులకు చెందిన కార్లు అని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని పొదల్లో మంటలు చెలరేగడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పార్కింగ్ సౌకర్యం ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయానికి సమీపంలో ఉందని.. పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన మొత్తం 16 కార్లు దెబ్బతిన్నాయని.. కొన్ని వాహనాలను మంటల భారీ నుంచి తప్పించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అపూర్వ గుప్తా తెలిపారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకునేందుకు పోలీసులు క్రైమ్ టీమ్‌ను పిలిచారు. ఈ ప్రమాదంపై ఐపిసి సెక్షన్ 285 మరియు 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డిసిపి తెలిపారు. అయితే.. పార్కింగ్ లో 100కి పైగా కార్లు పార్క్ చేశారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించడం వల్ల మిగిలిన వాహనాలను సేఫ్ చేశారు.
Tirumala: రేపు తిరుమలకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక
Also Read
- ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు చెక్.. సిరీస్‌తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
- Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
మరో ఘటన ఉత్తర ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో జరిగింది. అక్కడి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు దుకాణాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ఉదయం 3.12 గంటలకు ఫతేపురి మసీదు సమీపంలో మంటలు చెలరేగాయి. వెంటనే 8 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మధు విహార్ ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటనపై ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ స్పందిస్తూ.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. మంటల్లో దెబ్బతిన్న వాహన యజమానులకు MCD నుండి పరిహారం ఇవ్వాలని ప్రవీణ్ శంకర్ డిమాండ్ చేశారు. నగరంలో మండుతున్న వేడిగాలుల మధ్య ఎటువంటి భద్రతా ప్రమాదాలు తలెత్తకుండా ప్రాథమిక అగ్నిమాపక పరికరాలను అమర్చాలని.. పార్కింగ్ కాంట్రాక్టర్లందరికీ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
Pune Porsche crash: నిందితుడి మెడికల్ రిపోర్టు మార్చిన వైద్యులపై వేటు
తాజావార్తలు
-
Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
-
Rajinikanth: ఆత్మకథతో మరో సంచలనం.. రజనీకాంత్ బయోపిక్ ప్లాన్ నిజమేనా?
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Anahat Singh: భారత స్క్వాష్‌లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం
-
ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు చెక్.. సిరీస్‌తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!