NTV Telugu Site icon

Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు

Fisherman

Fisherman

Fishermen Released: శ్రీలంక జైలు నుంచి విడుదలైన 15 మంది భారతీయ మత్స్యకారులు గురువారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వెళ్లి చేపలు పట్టినందుకు మత్స్యకారులను అరెస్టు చేశారు. తమిళనాడు మత్స్యశాఖ అధికారులు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికి స్వగ్రామాలకు పంపించారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఎనిమిది మంది మత్స్యకారుల బృందం 2024 సెప్టెంబర్ 27న మన్నార్ ద్వీపం ప్రాంతానికి సమీపంలో చేపలు వేడుతుండగా, శ్రీలంక నావికాదళం సరిహద్దు దాటి చేపలు పట్టినందుకు వారిని అరెస్టు చేసింది. ఆ తర్వాత అరెస్ట్ అయినా వారందరిని శ్రీలంక కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో శ్రీలంక జైళ్ల నుంచి 15 మంది జాలర్లను విడుదల చేసారు. ఇందులో ముగ్గురు రామేశ్వరం, 12 మంది నాగపట్నంకు చెందిన వారు ఉన్నారు.

Also Read: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం

కొలంబో నుంచి చెన్నై విమానాశ్రయానికి తరలించిన మత్స్యకారులకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసర పాస్‌పోర్టులు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులకు మత్స్యశాఖ అధికారులు స్వాగతం పలికి వివిధ వాహనాల్లో స్వగ్రామాలకు తరలించారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న మత్స్యకారులు పౌరసత్వ ధృవీకరణ, కస్టమ్స్ తనిఖీ, ఇతర లాంఛనాలు పూర్తి చేసుకొని వారి స్వగ్రామాలకు పంపించారు అధికారులు.

Show comments