NTV Telugu Site icon

Instagram : ఇన్ స్టాలో ఇంటికి రమ్మన్నాడు.. వాడుకుని వీడియో తీశాడు

New Project (9)

New Project (9)

Instagram : స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని సోషల్ మీడియాలో చాలామంది తీరికలేకుండా గడుపుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల స్టూడెంట్లకు ఆన్ లైన్ క్లాసుల పేరిట ప్రతి ఒక్కరికి ఫోన్ అవసరమైంది. చిన్న పిల్లలు సైతం ఫోన్లలో మునిగిపోతున్నారు. కొంతమంది పిల్లలు ఫోన్లలో క్లాసులు వింటున్నట్లు తల్లిదండ్రులకు భ్రమకల్పిస్తున్నారు. అలా వారు చేసే పనుల వల్ల సమస్యలు తెచ్చుకుని ఇబ్బందులపాలవుతున్నారు. ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 14ఏళ్ల వయసున్న బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య చాటింగ్ మొదలయ్యింది. చాటింగ్ సమయంలో తియ్యటి మాటలతో అమ్మాయిని అట్రాక్ట్ చేశాడు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వారిద్దరి మధ్య చాటింగ్ మరింత లోతుకు వెళ్లింది.

Read Also: Sudan Fighting: సూడాన్ పోరులో 400 మంది మృతి.. 3,500 మందికి గాయం: WHO

ఆ సమయంలోనే ఆ యువకుడికి దుర్భుద్ది పుట్టింది. ఆ చాట్ ను ఆసరాగా చేసుకొని ఆమెపై బ్లాక్ మెయిలింగ్ దిగాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ ను బయటపెడతాను అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. కొంత కాలం తరువాత ఆ బాలికను ఆ యువకుడు తన ఇంటికి రావాలని కోరాడు. దీంతో ఎక్కడ తన చాట్ భయటపడుతుందనే భయంతో అతడి చెప్పిన విధంగా చేసింది. అతడి ఇంటికి వెళ్లింది. తరువాత ఆమెను లైగికంగా వాడుకున్నాడు. ఈ దృశ్యాలను అతడు వీడియోతో పాటు ఫొటోలు కూడా తీశాడు. వాటి సాయంతో కూడా ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనతో పాటు తన స్నేహితులతోనూ గడపాలని బాలికను ఒత్తిడి పెట్టాడు. అతడి బెదిరింపులతో విసిగిపోయిన బాలిక సమీపంలోని పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Tollywood: రాముడు ఎవరైతే బాగుంటుంది? ఏంటో ఈ గోల…

Show comments