NTV Telugu Site icon

Kolkata Doctor Case: కోల్‌కతా ఘటన నిందితుడికి 14 రోజుల కస్టడీ..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

కోల్‌కతా మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును శుక్రవారం సీల్దా కోర్టులో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. నిందితుడు సంజయ్ రాయ్‌ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్‌లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నివేదిక ప్రకారం.. సంఘటన సమయంలో నిందితుడు మద్యం సేవించినట్లు దర్యాప్తులో తేలింది. సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు.. నిందితుడు తన స్నేహితుడితో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి వచ్చాడు.

Air India: ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. రూ.90లక్షలు ఫైన్.. దేనికోసమంటే..!

కేసు దర్యాప్తును పరిశీలిస్తే.. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న ఘోష్‌తో పాటు ఇతర జూనియర్‌ వైద్యులను పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ చేసేందుకు అనుమతించాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. అంతేకాకుండా.. లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. ఈ కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు ఆగస్టు 13న సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు.. కేంద్ర ఏజెన్సీ కోల్‌కతా పోలీసుల నుండి విచారణను చేపట్టింది.

AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!

మరోవైపు.. అత్యాచారం, హత్య కేసుకు నిరసనగా కోల్‌కతాలో నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ జూనియర్ డాక్టర్ల సమ్మె శుక్రవారంతో 15వ రోజుకు చేరుకుంది. సమ్మెలో ఉన్న వైద్యులు తమ ఆందోళన విరమించి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు చెప్పింది. సమ్మె కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆస్పత్రిలో వైద్యుల రక్షణ కోసం సీఐఎస్‌ఎఫ్‌ను మోహరించారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు పురోగతిని తెలుసుకునేందుకు సీబీఐ కార్యాలయానికి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్తామని జూనియర్ వైద్యులు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.