Site icon NTV Telugu

Pakistan: ఘోరప్రమాదం.. లోయలో పడ్డ మినీట్రక్.. 13 మంది మృతి

Ree

Ree

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖుషబ్‌లో మినీట్రక్ లోయలో పడి ఐదుగురు చిన్నారులతో సహా 13 మంది మృతిచెందారు. ఒక కుటుంబం బన్నూ నుంచి సూన్ వ్యాలీకి వెళుతుండగా ట్రక్కు ఒక్కసారిగా మలుపు దగ్గర అదుపు తప్పి లోయలోపడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు వెంటనే చేరుకుని క్షతగాత్రులను, మృతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: ముస్లిం రిజర్వేషన్లు కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఇవ్వండి..

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖుషబ్ జిల్లాలో ఒక కుటుంబంతో వెళ్తున్న మినీ ట్రక్కు లోయలో పడిపోవడంతో ఐదుగురు పిల్లలు సహా కనీసం 13 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబం బన్నూ నుంచి ఖుషబ్‌లోని సూన్ వ్యాలీకి ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ వేగంగా టర్న్ తీసుకోవడంతో వేగంగా ట్రక్ లోయలో పడిపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Bear Attack: అందుకే అదుపులో ఉండాలనేది.. రెప్పపాటులో మహిళపై ఎలుగుబంటి దాడి..

Exit mobile version