Indonesia: ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia: ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైదానంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 127మంది మరణించారు. మరో 180మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్ లో జరిగింది. సరదాను పంచాల్సిన మ్యాచ్‌లో బీభత్సం, హింసా కాండ నడిచింది. ఇండోనేసియాలోని టాప్ లీగ్‌గా గుర్తింపు పొందిన బ్రి లిగా 1లో భాగంగా శనివారం రాత్రి మలాంగ్ స్టేడియంలో స్థానిక అరేమా ఎఫ్‌సీ, పెర్సేబయా సురబయా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్సేబయా జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది.
స్థానిక జట్టు అయిన అరేమా ఎఫ్‌సీ అభిమానులు.. తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. పిచ్ మధ్యలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జి.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
Read also: up accident: చెరువులో పడ్డ ట్రాక్టర్.. 26మంది మృతి
మలాంగ్‌లోని స్టేడియానికి హాజరైన ప్రేక్షకులు.. పిచ్ మధ్యలోకి పరిగెత్తుతున్న దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో బ్రి లిగా 1 (BRI Liga 1) లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించినట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేసియా ప్రకటించింది.
Read also:Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఎదురుదెబ్బ.. ఇమ్రాన్ ఖాన్‌కు అరెస్ట్ వారెంట్
తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ BRI లిగా 1 ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని ఇండోనేషియా పోలీసు చీఫ్ నికో అఫింటా ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. అరేమా ఎఫ్‌సి – పెర్సెబయా సురబయా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా దాడికి దిగారని తెలిపారు. దీంతో అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని, ఇది కాస్త తొక్కిసలాటకు దారితీసిందన్నారు. ఈ హింసాకాండలో చాలామందికి ఊపిరాడకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!