Site icon NTV Telugu

Assam : బాలిక పై అత్యాచారం చేశాడు.. చంపి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు

New Project (19)

New Project (19)

Assam : దేశంలో రోజు రోజుకూ మహిళలు చిన్నారులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా… పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా దారుణాలు తగ్గడం లేదు. కామాంధుల చేతిలో మహిళలు, ముక్కుపచ్చలారని చిన్నారులు బలైపోతున్నారు. తాజాగా మరో అమానుష ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. కోరిక తీర్చుకున్నాక బాలికను అతి కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అస్సాం రాష్ట్రంలోని తిన్‌సుకియా జిల్లా మార్గరీటా ప్రాంతంలో అనన్ భార్యతో కలిసి నివసిస్తున్నాడు.

Read Also: Sharad Pawar: ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ కొనసాగాలి.. రాజీనామా తిరస్కరణ

అదే ప్రాంతానికి చెందిన 12ఏళ్ల బాలిక తరచూ వీరి ఇంటివైపు వస్తుండేది. ఆ క్రమంలోనే అతడికి బాలికపై కన్ను పడింది. ఎలాగయినా ఆ చిన్నారి పై అత్యాచారం చేయాలని సమయం కోసం ఎదురు చూశాడు. మంగళవారం అతడికి బాలిక ఒంటరిగా కనిపించడంతో దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన అనన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృతచేష్టలతో బాలిక భయపడిపోయింది. బాలిక ఏడవడం చూసి విషయం బయటపెడుతుందోనని అతడు మరో దారుణమైన ఆలోచన చేశాడు. బాలికను చంపి ఆ మృతదేహాన్ని ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు. అనంతరం అక్కడనుంచి పరారయ్యాడు.

Read Also:YSR Kalyanamastu: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

ఇలోగా తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. అనన్ ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం లభించింది. అప్పటికే అనన్ పరారీలో వుండటంతో అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ లో నిందితుడు అనన్ పట్టుబడ్డాడు. అయితే స్వరాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల నుండి అనన్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అనన్ ను వెంబడించిన పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని పోలీసులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలన్న స్థానికులు డిమాండ్ చేయడంవల్లే పోలీసులు కాల్పులు జరిపి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version