NTV Telugu Site icon

Heart Attack: గుండెపోటుతో చనిపోయిన 12ఏళ్ల బాలుడు.. కర్ణాటకలో ఘటన

Boy

Boy

Heart Attack: సాధారణంగా గుండెపోటు తీవ్ర ఒత్తిడికి గురైన వ్యక్తులకు ఎక్కువగా వస్తుంటుంది. అది కూడా గుండెపోటు 50 ఏళ్లకు పైబడిన వారికే వస్తుంది. కానీ ఇటీవల కాలంలో 25 ఏళ్ల యువకులకు సైతం వస్తుంది. ఇది అందర్నీ ఆలోచించేలా చేసే బాధాతప్త ఘటన. అప్పటి వరకు ఆటపాటల్లో మునిగి తేలిన 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించిన ఉదంతమిది. కర్ణాటకలోని మడికేరి జిల్లాలోని కూడుమంగళూరుకు చెందిన మంజాచారి పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు.

Read Also: Pongal Gift: రాష్ట్రప్రజలకు సర్కారు కానుక.. సరుకులతో పాటు రూ.1000కూడా

శనివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ తల్లడిల్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ అబ్బాయిని కుశాలనగర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని నిర్దారించారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అంత చిన్న వయసులో గుండెనొప్పి రావడం ఏంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Read Also: Earthquake: జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు