Punjab: 12వేల మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల రెగ్యులరైజ్.. ప్రభుత్వ బడుల విద్యార్థులకు బస్సు సౌకర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12,710మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం.. కాంట్రాక్టు టీచర్ల రెగ్యులరైజ్ కు సంబంధించిన పత్రాలను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎంతో చారిత్రాత్మకమైందన్నారు.
Dulquer Salmaan: ‘కాంత’గా దుల్కర్ సల్మాన్..నిర్మాతగా రానా
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
టీచర్లకు ఉద్యోగ భద్రత ఉంటేనే విద్యార్థుల జీవితాలను మార్చగలరనే ఉద్దేశంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి భగవంత్ మాన్ ఒప్పంద టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడంపై దృష్టిసారించారు. మరోవైపు తన ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించడంపై ఓ ఉపాధ్యాయుడు కన్నీళ్లతో సీఎంను ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు చెప్పారు. దీంతో సీఎం మాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కూడా ఉపాధ్యాయుడేనని.. ఆ వర్గం ఎదుర్కొనే ఇబ్బందులేంటో తనకు తెలుసన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. గత ప్రభుత్వాల పాలకులు పట్టించుకోని కారణంగానే టీచర్లు చాలీచాలని వేతనాలతో పనిచేయాల్సి వచ్చిందని.. చట్టబద్ధమైన హక్కుల కోసం కూడా నిరసనలు చేయాల్సిన పరిస్థితి రావడం రాజభవనాల్లో నివసించే నేతలు (ఎవరి పేరునూ ప్రస్తావించలేదు) ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని.. వాళ్లకు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియవన్నారు. ఉపాధిహామీ పనులకు వెళ్తున్నవారికి కూడా టీచర్ల కన్నా ఎక్కువ వేతనం వచ్చే పరిస్థితి ఇదివరకు ఉండేదన్నారు.
Srisailam: శ్రీశైలంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు
ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం.. టీచర్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ తో ఉపాధ్యాయుల వేతనాలు భారీగా పెరిగాయి. ఇంతకుముందు పంజాబ్‌లో అసోసియేట్ టీచర్లకు నెలకు రూ.9500ల చొప్పున వేతనం ఉండగా.. ఇప్పుడు రూ.20,500లకు పెరగనుంది. అలాగే, ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్, నర్సరీ టీచర్ ట్రైనింగ్ అర్హత కలిగిన టీచర్లకు రూ.10,250 నుంచి రూ. 22వేలు; బీఏ/ఎంఏ బీఈడీ డిగ్రీలు కలిగిన ఉపాధ్యాయులకు రూ. 11వేలు నుంచి రూ.23,500లకు వేతనాలు పెరగనున్నాయి. అంతేకాకుండా ఏటా 5శాతం ఇంక్రిమెంట్‌తో పాటు ఇతర సౌకర్యాలను కూడా ఉపాధ్యాయులకు ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. ఉపాధ్యాయులకు కేవలం బోధనాపరమైన వ్యవహారాలకే తప్ప నాన్‌టీచింగ్ డ్యూటీని కేటాయించరాదని ఇదివరకే తమ ప్రభుత్వం నిర్ణయించిందని భగవంత్ మాన్ పేర్కొన్నారు.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. ఐదు రోజులలో రెండోసారి
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం త్వరలోనే బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద 20వేల మంది విద్యార్థులకు (12వేల మంది బాలికలు; 8వేల మంది బాలుర)కు ఈ సర్వీసులను అమలు చేస్తామని తెలిపారు. బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి తమ విద్యను పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ఈ పథకం చేపడుతున్నామని సీఎం చెప్పారు. ఈ పథకానికి 21 కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు కోసం ఏర్పాటు చేసే బస్సుల్లో జీపీఎస్ పరికరాలను అమర్చనున్నట్టు చెప్పారు. వాటి ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ట్రాక్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!