NTV Telugu Site icon

Heart Attack: దేశంలో 12.5% పెరిగిన గుండెపోటు మరణాలు.. కారణం ఏమిటంటే..!?

Untitled 7

Untitled 7

Heart Attack: ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చాలంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం గుండెపోటు మరణాలసంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న గుండెపోటు సమస్య పైన ఎన్‌సీఆర్‌బీ ద్రుష్టి సారించింది. ఎన్‌సీఆర్‌బీ చేసిన పరిశోధనల నివేదిక ప్రకారం 2021తో కంటే 2022లో గుండెపోటు మరణాలు 12.5 శాతం పెరిగాయని వెల్లడించింది.కేవలం 2022 లోనే గుండె పోటు కారణంగా 32,547 మందిమరణించారని తెలిపింది. ఈ మరణాలకు కారణాన్ని కూడా కనుగొన్నామని పేర్కొంది. ఇలా గతంలో కంటే ప్రస్తుతం గుండెపోటు శాతం పెరగడానికి కారణం కొవిడ్‌ వ్యాధి అని తెలిపింది. కొవిడ్‌ వ్యాధి వల్ల గుండె పనితీరు బలహీనంగా మారిందని.. దీనితో గుండెపోటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించింది.

Read also:Taliban : బాలికల విద్యను నిషేధిస్తే ప్రజలకు మనం దూరమవుతాం..ఒప్పుకున్న తాలిబన్లు

2022లో 56,450 హఠాత్తు మరణాలు సంభవించాయని పేర్కొన్న ఎన్‌సీఆర్‌బీ.. హింస వల్ల కాకుండా ఏ ఇతర కారణాల చేత మరణించిన.. ఉదాహరణకు గుండెపోటు, మెదడులో రక్తస్రావం వంటి కారణాలతో నిమిషాల వ్యవధిలో మరణం సంభవిస్తే ఆ మరణాన్ని హఠాత్తు మరణంగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే ఇలా హఠాత్తు మరణాల సంఖ్య పెరగడం పెరగడం ఆందోళన కలిగిస్తుందని విచారం వ్యక్తం చేసింది. అలానే ఈ మరణాలను అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. నిత్యం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండడం వంటి లక్షణాలను అలవర్చుకోవడం వల్ల గుండెపోటు సమస్యను అధిగమించవచ్చు అని తెలిపింది.