Site icon NTV Telugu

CSK Super Fan: ధోనీని కలవాలని ఉంది.. 103 ఏళ్ల సీఎస్కే సూపర్ అభిమాని వీడియో వైరల్

Csk Fan

Csk Fan

మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. ఆయనకు దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తాజాగా.. ధోనీ ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకిదే చివరి సీజన్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. అభిమానులు తలాను చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతున్నారు. చిన్న చితకా అని తేడా లేకుండా మహీ కోసం బారులు తీరున్నారు. ఇదిలా ఉంటే.. ధోనీకి అమ్మాయిలు, అబ్బాయిలతో పాటు చిన్న పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలోనే అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. అతనికి 103 ఏళ్ల తాత.. రాందాస్ అనే వీరాభిమాని ఉన్నాడు.

Jr NTR: కొడాలి నాని నామినేషన్ ర్యాలీలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు!

కాగా.. చెన్నై ఫ్రాంచైజీ రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఓ వ్యక్తి.. రాందాస్ తాతను మీరు ఎంఎస్ ధోనిని కలవాలనుకుంటున్నారా? అడిగిన ప్రశ్నకు.. రాందాస్ కొంచెం చిరునవ్వుతో ‘అవును.’ అని చెప్పారు. ఈ వీడియోలో 103 ఏళ్ల సీఎస్కే అభిమాని రామ్‌దాస్.. ధోని మరియు ఫ్రాంచైజీపై తనకున్న ప్రేమను వెల్లడించాడు. రాందాస్ క్రికెట్ అభిమాని. నేటికీ అతను క్రికెట్ మ్యాచ్‌లు చూస్తాడు. కానీ.. క్రికెట్ ఆడటానికి భయపడతాడు. సీఎస్కేని ఉత్సాహపరచడం.. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటం చాలా ఇష్టం. చెన్నైతో తలపడే ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్‌ను చూడటానికి ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారా అని రాందాస్‌ను అడగగా.. ఆయన నవ్వుతూ.. నేను ఢిల్లీ వరకు నడుచుకుంటూ వెళ్లి చూస్తానని చెప్పారు.

Madhavi latha: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ఆస్తులెన్నో తెలుసా! ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా రికార్డ్!

ఈ వీడియోలో రాందాస్ మాట్లాడుతూ.. స్కూల్‌లో చదువుతున్నప్పుడు క్రికెట్‌పై ఆసక్తి ఉండేదన్నారు. అయితే దెబ్బలు తగులుతుందనే భయం ఉండేది.. బౌలింగ్ చేస్తాను.. క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ ఆడాలంటే భయం.. అని చెప్పుకొచ్చారు. “20 ఓవర్ల ఆట త్వరగా ముగుస్తుంది. కావున నాకు అది ఇష్టం.” అని చెప్పారు. మరోవైపు.. రాందాస్ ఇప్పటికీ చెన్నై జట్టుకు ధోనీనే కెప్టెన్‌గా భావిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. సీఎస్కేకు చాలా సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. శరవణన్ హరికి సీఎస్కే అంటే పిచ్చి. తాను చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోతాడు. తన ఒంటికి పసుపు రంగు వేసుకుని, సీఎస్కే జెర్సీలో వెళ్లి జట్టును ఉత్సాహపరుస్తాడు.

Exit mobile version