100 Day Cough: కలకలం రేపుతోన్న వందల రోజుల దగ్గు వ్యాధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
100 Day Cough: బ్రిటన్‌లో వందల రోజుల దగ్గు వ్యాధి కలకలం రేపుతోంది. దీన్ని అంటు వ్యాధిగా గుర్తించిన ఆరోగ్య నిపుణులు.. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ వ్యాధి ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలై.. దగ్గు అధికమవుతుందని చెబుతున్నారు. దీని కారణంగా గొంతులో పుండ్లు, చెవిలో ఇన్ఫెక్షన్లకు గురయిన కేసులు బయటపడ్డాయి. ఓ దశలో మూత్రవిసర్జన ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాక్టీరియా కారణంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూడు, నాలుగు నిమిషాల పాటు తీవ్రమైన దగ్గు రావడం వల్ల వాంతులు, లేదా పక్కటెముకలు విరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు యూకేలో కనిపిస్తున్నాయి.
Read Also: Karthika Masam Last Monday: కార్తిక మాసం ఆఖరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Also Read
- Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- Ireland: ఐర్లాండ్‌లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
జూలై – నవంబర్ మధ్య 716 పెర్టుసిస్ కేసులు నమోదయ్యాయని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఈ కోరింత దగ్గు గతేడాదితో పోలిస్తే 250 శాతం పెరిగిందని వెల్లడించింది. ముఖ్యంగా పిల్లులు, వృద్ధుల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లల్లో ఈ దగ్గు నివారించడానికి, మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి టీకాలు అవసరమని NHS హెచ్చరించింది. గర్భిణీలు టీకాలు వేయించుకోవాలని… తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. యూకేలో అందరూ సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. దగ్గు వచ్చినప్పుడు నోటికి ఏదైనా క్లాత్ అడ్డుపెట్టుకోవాలంటున్నారు. ఇది అంటువ్యాధిలా వ్యాపిస్తుందని… తుంపర్ల ద్వారా ఎటాక్ అవుతుందంటుని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. నివారించడం సాధ్యమేనని అంటున్నారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్‌లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!