NTV Telugu Site icon

Israel Attack: ఇజ్రాయెల్ దాడి.. 10 మంది పాలస్తీనియన్లు మృతి, 80 మందికి పైగా గాయాలు

Israel

Israel

Israel Attack: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరం నబ్లస్‌పై బుధవారం జరిగిన దాడిలో ఇజ్రాయెల్ దళాలు 10 మంది పాలస్తీనియన్లను చంపగా, 80 మందికి పైగా తుపాకీ గాయాలకు గురయ్యారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఉగ్రవాద అనుమానితులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు.. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పాలస్తీనా ఉన్నతాధికారి హుస్సేన్ అల్ షేక్ ఇజ్రాయెల్‌ సైన్యం చొరబాటును ఊచకోతగా అభివర్ణించారు. ప్రజలకు అంతర్జాతీయ రక్షణ కావాలని ఆయన కోరారు. నాబ్లస్ ఆపరేషన్‌లో లక్ష్యంగా ఉన్న ముగ్గురు నిందితులు భవనం నుంచి పారిపోతున్నప్పుడు లేదా ఎదురుకాల్పుల్లో చంపబడ్డారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సాధారణ పౌరులకు ఏమి కాలేదని పేర్కొంది.

Read Also: Locked Self: ఆ భయంతో.. మూడేళ్లుగా గృహనిర్బంధంలోనే ఉండిపోయిన తల్లీకొడుకులు!

ఇదిలా ఉండగా.. నబ్లస్‌ నగరం దురాక్రమణ ఫలితంగా 16 నుంచి 72 ఏళ్ల మధ్య వయస్కులు 10 మంది చంపబడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 82 మంది తుపాకీ గాయాలతో పలు ఆసుపత్రుల్లో చేరినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పాలస్తీనా టీవీ జర్నలిస్ట్ మహ్మద్ అల్ ఖతీబ్ కూడా ఉన్నారు. పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తన వైద్యులు 250 టియర్ గ్యాస్ పీల్చడం, డజన్ల కొద్దీ తుపాకీ గాయాలకు చికిత్స చేశారని చెప్పారు. అరబ్ లీగ్ ఈ దాడిని హేయమైన నేరంగా పేర్కొంది. ఈ భయంకరమైన మారణకాండకు ఇజ్రాయెల్ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని అరబ్ లీగ్ పాలస్తీనా వ్యవహారాల సహాయ సెక్రటరీ జనరల్ సయీద్ అబు అలీ అన్నారు.