NTV Telugu Site icon

Tirumala Laddu Prasadam: ప్రత్యేక కార్గో ఛాపర్‌లో అయోధ్యకు చేరుకున్న శ్రీవారి లడ్డూలు..

Tirumala

Tirumala

Tirumala Laddu Prasadam: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. భక్తుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటుంది.. అయితే, ఇప్పుడు అయోధ్యకు చేరుకున్నాయి శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలు.. దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ.. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్.. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. అయోధ్యకు పంపించడానికి ప్రత్యేకంగా లక్ష లడ్డూలను తయారు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఈ రోజు ఉదయం తిరుమల నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తరలించింది.. ఇక, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా అయోధ్యకు తరలించారు. కాగా, అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండల నిర్ణయం తీసుకుంది.. దాని అనుగుణంగా లడ్డూలను తయారు చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేయించారు.. ఈ రోజు తిరుపతి విమానాశ్రయాని నుండి ఉదయం ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు చేర్చారు టీటీడీ అధికారులు.. అక్కడ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ అధికారులకు అందజేయనున్నారు.

Read Also: Babur Road Name Change: బాబర్ రోడ్ పేరు మార్చాలని హిందూసేన డిమాండ్