Site icon NTV Telugu

Singapore Airlines: విమానంలో తీవ్రమైన అలజడి.. ఒకరి మృతి

Sp

Sp

సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా తీవ్రమైన అల్లకల్లోనికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. అనంతరం ఫ్లైట్ బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ హఠాత్తు పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Rajasthan: ఇంట్లో సమస్యలు ఉన్నాయని వెళ్తే.. ఆస్తి కాజేసిన తాంత్రికుడు

లండన్ నుంచి వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్రమైన అల్లకల్లోలానికి గురైనట్లుగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. మంగళవారం బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్ అయినట్లు పేర్కొంది. అందులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు మరణించాడని.. పలువురు గాయపడినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. బోయింగ్ 777-300ER విమానం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. గగనతలంలో ఉండగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో బ్యాంకాక్‌లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకరు చనిపోయినట్లుగా.. 30 మంది గాయపడినట్లుగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.

ఇది కూడా చదవండి: Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ సమావేశంలో తొక్కిసలాట..

లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమానం బయలుదేరింది. మార్గమధ్యంలో తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొంది అని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించబడిందని.. మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ల్యాండ్ అయినట్లు స్పష్టం చేసింది.

మృతుడి కుటుంబానికి ఎయిర్‌లైన్స్ సంతాపం తెలిపింది. క్షతగాత్రలకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పింది. ప్రయాణికులకు, సిబ్బందికి సాయం అందించడమే తమ ప్రాధాన్యత అని తెలిపింది. అవసరమైన వైద్య సదుపాయాలు అందిచేందుకు థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పింది. అలాగే బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపుతున్నట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

 

Exit mobile version