Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
- యుస్మార్గ్ ఎన్కౌంటర్లో పాకిస్తానీ లష్కర్-ఎ-తైబా కమాండర్ యాసిర్ హతం.
- యాసిర్ గతంలో సులేమాన్ మూసా గ్రూపులో పనిచేసినట్లు సమాచారం.
- పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారుల్లో మూసా ఒకరు.
- భద్రతా బలగాలకు ఇది పెద్ద విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yusmarg Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. యుస్మార్గ్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ లష్కరేతోయిబా కమాండర్ యాసిర్ హతమైనట్లు తెలుస్తోంది. యాసిర్ గతంలో లష్కరేకు చెందిన సులేమాన్ మూసా గ్రూపులో పనిచేసేవాడని సమాచారం. అయితే, సుమారు ఏడాది నుంచి యుస్మార్గ్ ప్రాంతంలో కీలక లష్కర్ కమాండర్‌గా పనిచేస్తు్న్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇతడి కార్యకలాపాలపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు శనివారం యుస్మార్గ్ ప్రాంతంలో అతడి కదలికలు గుర్తించాయి. దీంతో పక్కా ప్లాన్‌తో ఆపరేషన్ చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో యాసిర్ హతమయ్యాడు.
యాసిర్ గతంలో సులేమాన్ మూసా గ్రూపులో ఉండే వాడు. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి అయిన మూసాను గతేడాది దచిగామ్ ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఇప్పుడు యాసిర్ హతమైన తర్వాత భద్రతా ఏజెన్సీలు అతడి నెట్‌వర్క్‌పై దృష్టిసారించాయి. ఇతర లష్కర్ ఉగ్రవాదులతో ఇతడికి ఉన్న సంబంధాలు, ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇతడి పాత్ర, భవిష్యత్ ప్లాన్లలో ఇతడి ప్రమేయం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఇదిలా ఉంటే, శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్‌లో సైన్యం, ఇతర భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో పాకిస్తానీ జాతీయుడిగా అనుమానిస్తున్న మరో వ్యక్తి హతమయ్యాడు. ఈ ప్రాంతంలో మరో అనుమానిత ఉగ్రవాది కోసం గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..