Site icon NTV Telugu

YouTuber Jyoti Malhotra: పహల్గామ్ ఉగ్రదాడికి ముందే పాక్, చైనాకు వెళ్లిన జ్యోతి మల్హోత్రా..

Malhotra

Malhotra

YouTuber Jyoti Malhotra: హర్యానాలోని హిస్సార్‌కు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసిన కేసులో అరెస్ట్ అయింది. ఈ నేపథ్యంలో విచారణలో కీలక విషయాలను తెలిపినట్లు హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు మల్హోత్రా అనేక సార్లు పాకిస్తాన్‌, చైనాను సందర్శించారని వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను తమ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానా పోలీసులకు తెలియజేశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురిపై నిఘా పెట్టి దర్యా్ప్తు చేసి శుక్రవారం నాడు జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శాశంక్ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉందన్నారు.

Read Also: Fire Accident: పాతబస్తీ ప్రమాద సమయంలోనే హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం.. తేడా ఒక్కటే..!

ఇక, జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి విచారిస్తున్నారు. ఆమె ఆదాయ వనరులను గుర్తించడానికి మేము తన ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలనపై ఆరా తీస్తున్నామని హిస్సార్ ఎస్పీ శాశంక్ సావన్ అన్నారు. జ్యోతికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ధృవీకరించారు. సున్నితమైన రక్షణ సమాచారాన్ని ఆమెకు నేరుగా అందుబాటులో లేనప్పటికీ.. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన సమయంలో పీఐవోలతో ఆమె సంభాషణ “భయంకరమైనదని పేర్కొన్నారు. ఇక, మల్హోత్రా తన పాకిస్తాన్ పర్యటనల సమయంలో అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడినట్లు వివరాలను సేకరించాం.. ఇటీవలే ఆమె అరెస్టు జరిగినప్పటికీ, నిఘా సంస్థలు ఇప్పటికే ఆమె కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నాయని ఎస్పీ శాశంక్ కుమార్ సావన్ వెల్లడించారు.

Exit mobile version