Gaurav Taneja: బర్త్‌డే పేరిట అభిమానుల హల్‌చల్.. పాపులర్ యూట్యూబర్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఓ యూట్యూబర్ గౌరవ్ తనేజాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన పుట్టిన రోజు వేడుకను నోయిడాలోని సెక్టార్-51 మెట్రో స్టేషన్ దగ్గర జరుపుకోవడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లయింగ్ బీస్ట్‌గా పేరొందిన యూట్యూబర్ గౌరవ్ తనేజా అతని పుట్టినరోజును జరుపుకోవడానికి శనివారం నోయిడాలోని ఆక్వా లైన్ సెక్టార్ 51 మెట్రో స్టేషన్‌లో అతని అభిమానులు గుమిగూడడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో నిబంధనల ఉల్లంఘన పేరిట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అంతకుముందు.. అతను తన పుట్టినరోజును నోయిడా మెట్రోస్టేషన్‌లో అభిమానుల మధ్య జరుపుకొంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఓ మెట్రో కోచ్‌నూ బుక్ చేసినట్లు సమాచారం. దీంతో అతన్ని కలిసేందుకు వేలాది మంది.. మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. ఒక్కసారిగా తలెత్తిన రద్దీ కారణంగా స్థానికంగా తొక్కిసలాట జరిగింది.
రద్దీ కారణంగా మెట్రో ప్రయాణికులు, మెట్రో సిబ్బంది ఇబ్బందుల పాలయ్యారు. వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వారికి మెట్రోస్టేషన్ కింద టోకెన్లను పంపిణీ చేయడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సకాలంలో అక్కడి చేరుకుని రహదారులను క్లియర్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ‘ఫ్లయింగ్ బీస్ట్’ పేరిట ఉన్న అతని యూట్యూబ్ ఛానెల్‌కు 75.8 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గౌరవ్ తనేజా తన అద్భుతమైన కంటెంట్ ద్వారా పాపులర్ యూట్యూబర్‌గా నిలిచాడు. భారత్‌లో టాప్ యూట్యూబర్లలో తనేజా కూడా ఒకడు. గౌరవ్ తనేజా నెలవారీ ఆదాయం 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. అతనికి వేలాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!