AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్

  • యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను అరెస్ట్
  • ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన కేసులో అరెస్ట్
  • నేపాల్ నిరసన నుంచి ప్రేరణ పొందినట్లుగా వెల్లడి
Aisummit

Aisummit

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఏఐ సమ్మి్ట్‌లో గందరగోళం సృష్టించిన నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 16 నుంచి 20 వరకు భారత్ మండపంలో ఏఐ సమ్మిట్ జరిగింది. దీనికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా అనేక దేశాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: El Mencho: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెన్చో ఎలా దొరికాడు.. పట్టించింది ఎవరంటే..!

అయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను ఆధ్వర్యంలో కొందరు యువకులు సమ్మిట్‌లోకి ప్రవేశించి అర్ధనగ్నంగా ప్రదర్శించారు. అమెరికాతో డీల్ రద్దు చేసుకోవాలని నినాదాలు చేశారు. ఈ పరిణామంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 4:30 గంటలకు ఉదయ్‌ భానును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన జెన్ జెడ్ నుంచి యూత్ కాంగ్రెస్ ప్రేరణ పొందినట్లుగా కోర్టుకు పోలీసులు తెలిపారు. ఈ నిరసనను బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఖండించాయి.

ఇది కూడా చదవండి: UP: రక్తసంబంధానికి మాయని మచ్చ.. హత్య వెనుక అమానుషం.. వీడిన లక్నో మర్డర్ మిస్టరీ