NTV Telugu Site icon

Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఫైర్

Karnataka

Karnataka

యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్ పేరుతో యువతిని ట్రాప్ చేసి.. మోజు తీరాక నిందితుడు అంతమొందించాడంటూ బీజేపీ ధ్వజమెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నర్సు హత్యకు గురైందని మండిపడుతోంది.

హవేరి జిల్లా మసూర్ గ్రామానికి చెందిన యువ నర్సు స్వాతి రమేష్ బ్యాడ్గి.. రాణేబెన్నూర్ పట్టణంలో నర్సుగా పనిచేస్తోంది. నయాజ్ అనే యువకుడు.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల నయాజ్‌కు వేరే సంబంధం కుదిరింది. అంతే స్వాతిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Railway Bridge: అనకాపల్లిలో లారీ బీభత్సం.. కుంగిన వంతెన, తప్పిన పెను ప్రమాదం!

మాట్లాడాలంటూ స్వాతిని నయాజ్ పిలిచాడు. నయాజ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాణేబెన్నూర్‌లోని స్వర్ణ పార్క్‌కు వచ్చాడు. ఆమె కూడా స్వర్ణ పార్క్ వచ్చింది. అనంతరం అక్కడ నుంచి రట్టిహళ్లిలోని ఓ పాడుబడిన పాఠశాలకు తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని తుంగభద్ర నదిలో పడేశారు.

అయితే మార్చి 3న స్వాతి తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు గాలించగా.. మార్చి 6న తుంగభద్ర నదిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి పోస్టుమార్గం నిర్వహించగా.. గొంతు కోసి చంపినట్లుగా తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నయాజ్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులు వినయ్, దర్గాచారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దలు కుదిర్చిన వివాహానికి స్వాతి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో నయాజ్ చంపినట్లుగా పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ

అయితే ఈ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారం రేపుతోంది. మతాంతర హత్యలను అరికట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఈ హత్యను ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ హత్య మనసులను కలత పెట్టేస్తోందని వ్యాఖ్యానించారు. స్వాతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు.. త్వరతగతిన దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు.