NTV Telugu Site icon

Union Budget: తమిళనాడులో బడ్జెట్ మంటలు.. డీఎంకే వర్సెస్ బీజేపీ..

Union Budget

Union Budget

Union Budget: కేంద్ర బడ్జెట్ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారుణమవుతోంది. బడ్జెట్లో కేంద్రం తమిళనాడును పట్టించుకోలేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనపై దృష్టి సారించడం కన్నా ప్రత్యర్థులనున లక్ష్యంగా చేసుకుంటే మీరు ఒంటరి అవుతారని ప్రధానిని హెచ్చరించారు. ఇండియా కూటమిలోని డీఎంకే, బీజేపీ 400 స్థానాల ఆశల్ని దెబ్బతీసిందని, తమిళనాడులో రెండోసారి వరసగా ఓటమిని అందించిందని ఆయన అన్నారు.

Read Also: Bihar: పేపర్ లీకేజీకి పాల్పడితే పదేళ్లు జైలు.. రూ.కోటి ఫైన్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం

ఎన్నికలము ముగిశాయని, ప్రస్తుతం మనం దేశం గురించి ఆలోచించాలని, 2024 బడ్జెట్ మీ ప్రభుత్వాన్ని కాపాడుతుంది, కానీ దేశాన్ని కాదని, ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండని, లేకుంటే మీరు ఒంటిరి అవుతారని స్టాలిన్ అన్నారు. మిమ్మల్ని ఓడించిన వారి పట్ల మీరు ప్రతీకారం తీర్చుకోవద్దని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ మాట్లాడుతూ.. బీహార్ కన్నా 10 రెట్లు మేం భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నామని, మేమే అతిపెద్ద పన్ను చెల్లింపుదారులమని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, శనివారం జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి స్టాలిన్‌తో సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, సుఖ్విందర్ సుఖు దాటవేయనున్నారు. బడ్జెట్‌కి తమ నిరసన తెలియజేయనున్నారు.

ఇదిలా ఉంటే తమిళనాడులో అధికార డీఎంకే చేస్తున్న విమర్శలకు బీజేపీ గట్టిగానే స్పందిస్తోంది. నీతిఆయోగ్ సమావేశానికి గైర్హాజరు అవుతామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు సమర్పించిన 10 బడ్జెట్లలో ఆరు సార్లు తమిళనాడు ప్రస్తావన లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏ సంక్షేమ పథకం కూడా రావడం లేదనే అభిప్రాయాన్ని స్టాలిన్ కలిగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌‌తో కలిసి డీఎంకే కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆరు బడ్జెట్లలో రాష్ట్రం పేరు కూడా లేదని అన్నామలై ధ్వజమెత్తారు.