NTV Telugu Site icon

Darshan Case: స్టార్ హీరో దర్శన్ అరెస్ట్‌పై స్పందించిన నటి రమ్య.. ఏమన్నారంటే..

Ramya

Ramya

Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్, రేణుకా స్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ కావడం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఎంతో ముద్దుగా ‘డి బాస్’ , ‘ఛాలెంజింగ్ స్టార్’గా పిలుచుకునే దర్శన్ అరెస్ట్ కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఓ అభిమానిని చంపినందుకు అతడిని కఠినంగా శిక్షించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. దర్శన్‌ని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని, అతడి సినిమాలు విడుదల చేయొద్దని మృతుడు రేణుకాస్వామి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

దర్శన్ అప్పటికే పెళ్లైనప్పటికీ, పవిత్ర గౌడ అనే సహనటితో సహజీవనం చేస్తున్నాడు. తన అభిమాన హీరో సంసారాన్ని నాశనం చేశావంటూ రేణుకాస్వామి తరుచుగా పవిత్ర గౌడ సోషల్ మీడియాకు అసభ్యకరమైన మెసేజులు పెట్టడం హత్యకు కారణంగా తెలుస్తోంది. చిత్రదుర్గకు చెందిన స్వామిని బెంగళూర్ రప్పించి, దర్శన్, అతని సన్నిహితులు తీవ్రంగా దాడి చేయడంతో దెబ్బలకు తాళలేక మరణించాడు. డెడ్ బాడీని డ్రైనేజీలో పారేశారు. అయితే, ముందుగా ఆత్మహత్య అని భావించినప్పటికీ, పోలీసులు విచారిస్తున్నా కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో దర్శన్, పవిత్రలతో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు.

Read Also: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్‌.. భూకబ్జా కేసు నమోదు..

ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై ప్రముఖ కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన(రమ్య) స్పందించారు. ‘‘చట్టానికి ఎవరూ అతీతులు కాదు” అని అన్నారు. “ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు. మీరు ప్రజలను కొట్టడం మరియు చంపడం వంటివి చేయవద్దు. న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా లేదా అనేదానికి ఒక సాధారణ ఫిర్యాదు సరిపోతుంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కర్ణాటక పోలీసులపై ప్రశంసలు కురిపించారు. రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగిపోరని, చట్టంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిసతున్నారని రాసుకొచ్చారు. జస్టిస్ ఫర్ రేణుకాస్వామి, అని పోస్టును ముగించారు.

ఆమె దర్శన్‌తో పాటు మాజీ సీఎం యడియూరప్పపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ప్రస్తావించారు. ఇదే కాకుండా ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారాన్ని టచ్ చేశారు. మరోవైపు దర్శన్ సహనటి సంజనా గల్రానీ దర్శన్‌కి మద్దతుగా నిలిచారు. “ఇది నిన్న మాకు బ్లాక్ డే, మరియు ఇది కన్నడ పరిశ్రమకు వినాశనం లాంటిది. అతను కన్నడ పరిశ్రమలో ఆయన అభిమాన నటుడు’’ అని చెప్పారు. అతడి అరెస్ట్ కన్నడ పరిశ్రమకు అంతిమ రోజుగా అభివర్ణించారు.