Uddhav Thackeray: జూలై 1న అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన(యూబీటీ) ప్రశంసలు కురిపించింది. రాహుల్ గాంధీని ఎవరూ ఆపలేరనే విషయాన్ని ఇది తెలియజేస్తోందని బుదవరాం పేర్కొంది. పార్టీ మౌత్ పీస్ సామ్నాలో ఆయనపై ప్రశంసించింది. దేశవ్యాప్తంగా అధికార పార్టీ పతనం ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో పాలకులు మరిన్ని విషయాలను చూడబోతున్నారని పేర్కొంది.
Rahul Gandhi: Amazon Prime Day : భారీ డిస్కౌంట్లు అందించేందుకు అమెజాన్ రెడీ.. మరి కొనేందుకు మీరు రెడీనా..
గత 10 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలను, వారి బీజేపీ పార్టీని ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, రాహుల్ గాంధీ మోడీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, దీనికి ఆయనను అభినందించకుండా ఉండలేం అని సామ్నా పత్రికలో రాసుకొచ్చింది. బీజేపీ ‘‘హిందూ మతానికి గుత్తాధిపత్యం’’ కాదని రాహుల్ గాంధీ చేసిన ప్రకటన తర్వాత పార్లమెంట్‌లో తుఫాను చెలరేగిందని, గత 10 ఏళ్లలో తొలిసారిగా అమిత్ షా స్పీకర్ ఓం బిర్లా నుంచి రక్షణ కోరారని చెప్పింది.
ఇప్పటి వరకు మోడీ-షా తమ మెజారిటీ బలంతో పార్లమెంట్‌ని తమ కాళ్ల కింద ఉంచడానికి ప్రయత్నించారు, కానీ రాహుల్ గాంధీ నేతృత్వంలో బలమైన ప్రతిపక్షం పార్లమెంట్‌లో ఉందని సామ్నా పేర్కొంది. గత 10 ఏళ్లుగా వారు హిందుత్వ, మతం పేరుతో ఎన్నికల్లో పోరాడారని, ఇప్పుడు వారికి అసలు రూపం కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంతకుముందు 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి, ఖాళీ సభలో ముఖ్యమైన చట్టాలను తీసుకొచ్చారని, ఇప్పుడు రాహుల్ గాంధీ రాకతో నిద్రపోతున్న పార్లమెంట్ గోడలు కదిలాయని పేర్కొంది.