NTV Telugu Site icon

Yogi Adityanath: ‘‘పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్’’ .. విభజన పాపం కాంగ్రెస్‌దే..

Yogi

Yogi

Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే, వారు దేశాన్ని విభజిస్తారు. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్‌కి తెలుసు’’ అని అన్నారు.

Read Also: Karnataka: పాలస్తీనా జెండాలతో హల్‌చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్

పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్ వంటిదని అన్నారు. దానికి చికిత్స చేసేంత వరకు భారత సమస్యలను పరిష్కరించలేమని అన్నారు. ‘‘ప్రస్తుతం పీఓకే స్వేచ్ఛగా ఉండాలని మళ్లీ భారతదేశంలో కలవాలని డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్, దీనికి సకాలంలో చికిత్స చేయడానికి ప్రపంచం కలిసి రావాలి’’ అని అన్నారు.

1947లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారు భారతదేశాన్ని విభజించాలని కోరుకునే ముస్లింలీగ్‌కి మద్దతు ఇచ్చారని, దీంతోనే పాకిస్తాన్ పుట్టిందని అన్నారు. 1905లో బెంగాల్ విభజించడానికి బ్రిటీష్ ప్రయత్నాలను ప్రస్తావించారు. ఇది ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకున్నామని, ముస్లిం లీగ్‌పై ఇదే విధంగా వ్యతిరేకత చూపిస్తే పాకిస్తాన్ సృష్టిని నిరోధించి ఉండేవాళ్లమని అన్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ఇటీవల అశాంతిపై యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం లేదని, దీనికి బాధ్యులెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, తిప్ర‌మోతా అధినేత ప్ర‌ద్యోత్ కిషోర్ మాణిక్య దెబ్బ‌ర్మ కూడా పాల్గొన్నారు.