ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు కర్మాగారాల్లో రాత్రి షిఫ్టులలో పని చేసే.. మహిళల భద్రతను నిర్ధారించడానికి వివరణాత్మక మార్గదర్శకాలతో పాటు, కార్మిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించారు. రాత్రి షిఫ్టులలో పనిచేసే మహిళలకు ప్రత్యేక భద్రతా నిబంధనలు, అవసరమైన మార్గదర్శకాలను అమలు చేస్తామని స్పష్టం చేస్తూ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది..
Read Also:Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్
ప్రభుత్వం కర్మాగారాలు, పారిశ్రామిక సంస్థలు మహిళలను రాత్రి షిఫ్టులలో (సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు) నియమించుకోవడానికి అనుమతించింది. కానీ మహిళా ఉద్యోగుల వ్రాతపూర్వక అనుమతితో.. వారిని పనిలోకి తీసుకోవాలని.. తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో…మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడం.. అన్ని కార్యాలయాల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా పరిశ్రమలలో బలమైన పాత్ర పోషించడానికి వీలు కల్పిస్తుంది. ఇది రాష్ట్రంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచుతుంది. పారిశ్రామిక ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా, సమాజంలో మహిళల పట్ల వైఖరిని సానుకూలంగా మార్చడానికి ఈ దశ ఒక ప్రధాన అడుగుగా పరిగణించబడుతుంది.
Read Also:Health Benefits of Amla: ఉసిరి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా…
అయితే .. పని ప్రదేశాలలో తగినంత లైటింగ్, సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని.. అంతేకాకుండా మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. అత్యవసర హెల్ప్‌లైన్‌లు, ప్రథమ చికిత్స మహిళా భద్రతా సెల్‌లను అందించాలని సూచించింది.
