కరోనా మహమ్మారీ జనాలను ఎలా వణికించిందో చుసాం.. ఎక్కడ చూసినా చావులు.. ఆ భయంకరమైన వ్యాధి మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. అయితే గత ఏడాది కూడా భయంకరమైన అంటూ వ్యాధులు జనాలను వణికించాయి.. ఆరోగ్యం విషయంపై చాలా మంది ప్రాణాలతో పోరాడారు.. అటువంటి అంటువ్యాదుల ప్రభావం గత ఏడాది ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’.. ఇది ఒక భయంకరమైన వైరస్.. కోవిడ్-19 కి సంబంధించిన ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్.. 2023 లో అనేకమంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కావడంతో దీని వ్యాప్తిని నిరోధించాలంటే 2024 లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… తగు జాగ్రత్తలు పాటించాలి.. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చూపించకూడదు..
2023 ప్రారంభంలో ఇండియా, యునైటెడ్ స్టేట్స్‌తో సహా అనేక దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరిగాయి. ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరకలేదు. 2024 లో సైతం ప్రజలు దీనిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి.. ఇప్పడిప్పుడే వ్యాధి బారిన పడేవారి సంఖ్య పెరుగుతుంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..
ఇక చివరగా టొమాటో ఫీవర్.. 2023 లో పిల్లల్లో ఇది గుర్తించబడింది. ఇది ఒకరి నుండి మరొకరికి ఈజీగా సోకుతుంది. ఈ అంటు వ్యాధిపై 2024 లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నివారణ కోసం నిర్దిష్టమైన జాగ్రత్తలు కూడా అవసరం. కొన్ని నెలల క్రితం కండ్ల కలక కేసులు కూడా గణనీయంగా కనిపించాయి. పింక్ ఐగా పిలవబడే ఇది ఇతరులకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. కనురెప్పల లోపల, బయట కంటి లోపలి భాగాలను ఇది ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్… దీన్ని వెంటనే గుర్తించడంతో ఎటువంటి ప్రమాదం లేకుండా పోయింది.. ఇక ఇప్పుడు మళ్లీ కొత్త వైరస్ కలకలం రేపుతుంది..