Site icon NTV Telugu

Yogi Adityanath: ఫ్రాన్స్ అల్లర్లు అదుపులోకి రావాలంటే “యోగి”నే కరెక్ట్.. జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్..

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: ఫ్రాన్స్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని పారిస్ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరాయి. 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపడంపై అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా పారిస్ నగరంలో పలు ఆస్తుల్ని ధ్వంసం చేయడంతో పాటు లూటీలకు పాల్పడుతున్నారు. పారిస్ నగర మేయర్ ఇంటిపై కూడా దాడికి తెగబడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇందుకు కారణం ఆ ట్వీట్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ముడిపడి ఉండటమే.

Read Also: Kia Seltos: మళ్లీ కనిపించిన కొత్త సెల్టోస్ మ్యాజిక్.. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అదుర్స్..!

‘యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపండి’ 24 గంటల్లో ఫ్రాన్స్ అల్లర్లు అదుపులోకి వస్తాయని శుక్రవారం, ప్రొఫెసర్ ఎన్ జాన్ కామ్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ కనిపించింది. ‘‘అక్కడి అల్లర్ల పరిస్థితిని నియంత్రించడానికి భారతదేశం యోగి ఆదిత్యనాథ్ ను ఫ్రాన్స్ కి పంపాలి’’ అంటూ జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్ పై సీఎం ఆఫీస్ స్పందించింది. ప్రపంచంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినా.. యూపీలో నేరస్తులపై ఉక్కుపాదం మోపే యోగి మోడల్ ని అనుసరించాలి. దాంతో అల్లర్లు కట్టడి చేయవచ్చని..సీఎం యోగి ఆఫీస్ ట్వీట్ చేసింది.

అయితే ఈ ట్వీట్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చీటింగ్ కేసులో అరెస్టైన డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ కు చెందిన ట్విట్టర్ హ్యాండిల్ అని ఆరోపిస్తున్నారు. తప్పుడు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే విధానం అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. నకిలీ ట్వీట్లతో సంతోషిస్తున్నారని.. మేము లఖీంపూర్ ఖేరీ, హత్రాస్ లో యోగి మోడల్ ని చూశామని విమర్శించారు. విదేశీ ప్రశంసల కోసం బీజేపీ ఆరాటపడుతోందని విమర్శించారు.

Exit mobile version