S Jaishankar: 5 ఏళ్లలో తొలిసారి చైనా పర్యటనకు జైశంకర్..
- చైనా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్..
- ఐదేళ్లలో ఇదే తొలి పర్యటన..
- రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణకు కృషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
జూలై 14-15 తేదీలలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి టియాంజిన్ జైశంకర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశానికి సంబంధించి రేర్ ఎర్త్ మెటీయల్స్ సరఫరాపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: Thalassemia Disease: తలసేమియాపై అవగాహన.. ఆర్కే బీచ్‌లో 3కె, 5కె, 10కె రన్!
ఇటీవల దలైలామా వారసత్వం, ఇటీవల భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వంటి అంశాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించే అవకాశం ఉందని విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. గతేడాది చివర్లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ప్రారంభించినప్పటి నుంచి భారత అధికారులు చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి అవుతోంది. గత నెలలో, కింగ్డావోలో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాను సందర్శించారు.
ఈ ఏడాది ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోడీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారతదేశంలో చైనా రాయబారి ప్రధాని మోడీని హృదయపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. అయితే, భారత్ ప్రధాని హజరును ధ్రువీకరించలేదు. దీంతో పాటు వాంగ్ యీ సరిహద్దులపై చర్చించేందుకు జూలైలో అజిత్ దోవల్‌తో చర్చలు జరిపేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!