Indus Water Treaty: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ తరుణంలోనే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా భారతదేశానికి వచ్చారు. గురువారం ఆయన ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే, భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు ‘‘వరల్డ్ బ్యాంక్’’ దూరంగా ఉంది. ‘‘ప్రపంచ బ్యాంక్‌కి సహాయకుడి పాత్రకు మించి ఎలాంటి పాత్ర లేదు’’ అని అజయ్ బంగా చెప్పారు.
Read Also: IPL 2025 Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ అధికారిక ప్రకటన.. వారం రోజులు..!
‘‘ప్రపంచ బ్యాంక్ జోక్యం చేసుకుని సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై మీడియాలో చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ ప్రపంచ బ్యాంక్ పాత్ర కేవలం సహాయకుడిగా మాత్రమే ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. నిజానికి 1960లో ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వంతోనే ‘‘సింధు జలాల ఒప్పందం’’ జరిగింది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు, దాని ఉపనదులను భారత్ నియంత్రించడాన్ని ఆ దేశం తట్టుకోవడం లేదు.
ఇండస్ వాటర్ ట్రిటీ ద్వారా భారత్‌కి తూర్పు నదులైన చీనాబ్, బియాస్, సట్లేజ్‌పై హక్కు కలిగి ఉంది. పాకిస్తాన్ పశ్చిమ నదులైన సింధు, రావి, జీలంపై హక్కులను కల్పిగి ఉంది. అయితే, ఇప్పుడు ఈ ఒప్పందాన్ని భారత్ నిలపుదల చేసింది. పహల్గామ్ ఘటన తర్వాత నుంచి భారత్ చీనాబ్ నది నీటిని సలాల్, బాగ్లిహార్ డ్యాముల ద్వారా నియంత్రిస్తోంది.
