Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!
- లోక్‌సభలో వీడిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు..
- కానీ రాజకీయ వ్యూహంలో గెలిచిన బీజేపీ..
- ప్రతిపక్షాలు మహిళా బిల్లుకు వ్యతిరేకమని ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women reservation bill: 2029 సార్వత్రిక ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్ బిల్లుతో సహా లోక్‌సభ సీట్లను పెంచాలనే బీజేపీ కలకు బ్రేక్ పడింది. లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో మహిళా బిల్లుతో సహా మరో బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. 2/3 వంతు మద్దతును ఎన్డీయే ప్రభుత్వం కూడగట్టలేకపోయింది. బయట నుంచి చూస్తే ఇది బీజేపీకి ఘోర పరాజయంగా కనిపించవచ్చు, కానీ రాజకీయంగా ఇది బీజేపీకి విజయమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో ‘‘ఓడిపోయి బీజేపీ గెలిచింది. గెలిచి కాంగ్రెస్ ఓడిపోయింది’’ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు పడిన తర్వాత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. ఒక చారిత్రాత్మక బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు. మహిళా బిల్లును అడ్డుకున్నారని మండిపడ్డారు. అయితే, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
- Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
Read Also: Rahul Gandhi: మహిళా బిల్లు కాదు, అందుకే అడ్డుకున్నాం..
బీజేపీకి సంఖ్యా బలం లేదని ముందే తెలుసు. కానీ ప్రతిపక్షాల నుంచి మద్దతు వస్తుందని ఊహించారు. ఒక వేళ ఓడిపోతే ప్లాన్-బికి కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు గెలిచినా, ఓడినా క్రెడిట్ మొత్తం బీజేపీ ఖాతాలోకే వెళ్లినట్లయింది. ‘‘మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వ్యతిరేకం’’ అని బీజేపీ ఒక రాజకీయ నినాదాన్ని సృష్టించబోతోంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల ముందు ఇది ఎంతో కొంత ప్రభావం చూపించే అంశంగా మారింది. గురువారం లోక్‌సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ బిల్లును వ్యతిరేకించే వారిని దేశంలో మహిళలు క్షమించరని చెప్పారు.
ఇక ఇప్పటి నుంచి ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుపడుతుంది. కాంగ్రెస్, ఇండీ కూటమి బిల్లుకు వ్యతిరేకమనే ఒక వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. 2010లో మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించి సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీలు రాజకీయంగా కొంత కాలం దెబ్బతిన్నాయి. 2010లో అప్పటి మన్మోహన్ సింగ్ సర్కార్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకువచ్చింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు వ్యతిరేకించారు.
ప్రతిపక్షాలు బీజేపీ ప్రవేశపెడుతున్న బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని, దేశ రాజకీయ స్వరూపాన్ని మార్చే కుట్ర అని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాదిస్తున్నారు. వీటన్నింటిని పక్కన పెట్టి బీజేపీ మాత్రం కాంగ్రెస్ మహిళా వ్యతిరేకమనే నేరెటివ్ను తయారు చేస్తుంది. మొత్తానికి బీజేపీ బిల్లుల విషయంలో ఓడిపోయినప్పటికీ, రాజకీయ వ్యూహాల్లో మాత్రం గెలిచిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..