Lok sabha: వెలుగులోకి విపక్ష మహిళా ఎంపీల మరో వీడియో.. కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!

  • పార్లమెంట్‌లో విపక్ష మహిళా ఎంపీల ఆందోళన
  • మరో వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి
  • కేంద్రమంత్రులు అడ్డుకున్నట్లుగా దృశ్యాలు
Mps

Mps

పార్లమెంట్‌లో విపక్ష మహిళా ఎంపీలు చేసిన ఆందోళనకు సంబంధించిన మరొక వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల అత్యంత అవమానకరమైన ప్రవర్తన పట్ల గర్వపడుతోంది. బీజేపీ ఎంపీలు ఆపకపోతే చాలా వికారమైన సన్నివేశానికి దారితీసి ఉండేది..’’ అని రాసుకొచ్చారు.

ఫిబ్రవరి 4న సాయంత్రం పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ మహిళా ఎంపీలు.. ప్రధాని మోడీపై దాడి చేసే కుట్ర జరుగుతోందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగించకుండానే ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించింది.

ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్‌ విడుదల కాలేదు.. పబ్లిషర్ పెంగ్విన్ ప్రకటన

అయితే తాజాగా ఆనాటి ఘటనకు సంబంధించిన మరొక వీడియోను కేంద్రం విడుదల చేసింది. కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డు పట్టుకుని నిరసన చేసేందుకు ప్రధాని మోడీ, బీజేపీ ఎంపీలు కూర్చునే వైపునకు వచ్చారు. దీంతో వెంటనే కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, గిరిరాజ్ సింగ్, పలువురు ఎంపీలు అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పి అక్కడ నుంచి పంపేశారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.