Site icon NTV Telugu

Bengaluru: రెచ్చిపోయిన మృగాళ్లు.. నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు

Bengaluru

Bengaluru

దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. లైంగిక వేధింపులపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నా.. భయపడడం లేదు. తాజాగా బెంగళూరులో ఓ గ్యాంగ్‌.. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?

బెంగళూరుకు దాదాపు 12 కి.మీ దూరంలో ఉన్న మైలసంద్ర సమీపంలోని రేణుక ఎల్లమ్మ లేఅవుట్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఓ యువతి.. కిరాణా సామాగ్రి కొనేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. రోడ్డుపై యువకులు.. యువతిని అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇంతలో ఒకరు ఆమెను చెంపదెబ్బకొట్టాడు. దుర్భాషలాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.  కాపాడటానికి వచ్చిన స్థానికులపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: జగన్‌ రప్పా.. రప్పా.. వ్యాఖ్యలు..! పవన్ కల్యాణ్‌ పవర్ ఫుల్ వార్నింగ్..!!

గ్యాంగ్ బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఇంతలో ఆమె స్నేహితుడు, స్థానికులు రావడంతో వారి సాయంతో బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కిరాణా షాపునకు వెళ్తుండగా కొంత మంది పురుషులు తనను అడ్డుకున్నారని.. అప్పటికే వారు గొడవ పడుతున్నారని తెలిపింది. అనంతరం తనను ఆపి దుర్భాషలాడి.. అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపింది. స్థానికుల సాయంతో బయటపడినట్లు బాధితురాలు చెప్పింది. సహాయం చేయడానికి వచ్చిన వారిపై కూడా దాడి చేశారని తెలిపింది.

బన్నేర్‌ఘట్ట పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS) 74 (ఆమె గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్)తో పాటు ఇతర సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న యువతులపై ఒక యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version